చిన్నారి చిట్టి గుండె ఆపరేషన్ చేయించి పెద్ద మనసుని చాటుకున్న సూపర్‌స్టార్ మహేష్
నట వారసత్వంలోనే కాదు.. సహృదయతలోనూ తాను నిజంగా సూపర్‌స్టారేనని నిరూపించుకుంటున్నారు మహేష్. అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మహేష్ తనను అభిమానిస్తున్న ప్రేక్షకులకు ఏదో చేయాలనే ఉద్దేశంతో ఎన్నో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. మనసున్న ‘శ్రీమంతుడు’ ఆర్థికంగా స్థిరపడ్డవారు ఏదో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తే దేశం బాగుపడుతుందనే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ‘శ్రీమంతుడు’. ఇందులో హీరోగా చేసిన మహేష్ రీల్లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ తాను మనసున్న శ్రీమంతుడునని ప్రూవ్ చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని సూపర్ స్టార్ కృష్ణ సొంత ఊరైన బుర్రెపాలెం, తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా, కొత్తూరు మండంలోని సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకుని మహేష్ ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఈ రెండు గ్రామాలకు అవసరమైన మౌళిక వసతును ఏర్పాటు చేయడంలో మహేష్ ముందుంటున్నారు. మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్ దగ్గరుండి మరీ ఈ పనులను పర్యవేక్షిస్తుండటం గమనార్హం. చిన్నారు గుండె చప్పుడు కోసం చేయూత హృద్రోగాలతో ఇబ్బంది పడుతున్న చిన్నారు గుండె ఆపరేషన్స్ కోసం ప్రముఖ ఆంధ్ర హాస్పిటల్స్‌తో చేయి కలిపి చిన్నారుల గుండె ఆపరేషన్స్‌కు తోడ్పాటుని అందిస్తున్నారు మహేష్. ఇప్పటికే తన దయార్ద్ర హృదయంతో దాదాపుగా 1000 మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించిన సూపర్ స్టార్, నేడు మరొక చిన్నారి జీవితంలో సరికొత్త ఊపిరి నింపి మరోసారి తన గొప్ప మనసుని చాటుకున్నారాయన.
వివరాల్లోకెళితే…. తూర్పుగోదావరి జిల్లా తుమ్మలపల్లి గ్రామానికి చెదిన కుంచె ప్రదీప్, నాగజ్యోతి దంపతులకు అబ్స్ట్రక్టెడ్ టోటల్ ఎనామస్ ప్మనరీ వీనస్ డ్రైనేజీ(చెడు రక్తం, మంచి రక్తం కలిసిపోవడం) అనే అరుదైన గుండె జబ్బుతో బిడ్డ పుట్టింది. ఆ దంపతులకు ఆపరేషన్ చేయించే స్థోమత లేదు. ఈ విషయం తెలిసిన స్థానిక మహేష్ అభిమాన సంఘం మహేష్ వద్దకు విషయాన్ని తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న మహేష్ వెంటనే స్పందించారు.
మహేష్ అభ్యర్థన మేరకు పాపను ఆసుపత్రికి తీసుకురాగా..ఈ జూన్ 2న ఉచితంగా శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ తర్వాత పాపకు రక్తపోటు తగ్గటం, గుండె కొట్టుకోవడంలో మార్పులతో పాటు ఇన్ఫెక్షన్స్ వచ్చాయి. ఈ సమస్యను అధిగమించి రెండు వారాల తర్వాత ఇన్టెన్సివ్ కేర్ నుండి శిశువు బయటకు వచ్చింది. శస్త్ర చికిత్స చేసిన ఆంధ్రా హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ దిలీప్, డాక్టర్ రమేష్, డాక్టర్ విక్రమ్, డాక్టర్ కృష్ణ ప్రసాద్‌ను హాస్పిటల్ డైరెక్టర్ పి.వి.రామారావులను అభినందించారు. ఆపరేషన్ సక్సెస్ అవడంతో ఆ బిడ్డ తల్లితండ్రు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆంధ్ర హాస్పిటల్స్ వారికి, అలానే ప్రత్యేకంగా సూపర్ స్టార్ మహేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.













