ఇలా అయితే గుంటూరు కారం కష్టమే
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారం అనే సినిమాను ఎప్పుడో మొదలుపెట్టారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఏదొక రూపంలో ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. స్టోరో ఛేంజెస్, రీషూట్స్, ఆ తర్వాత చాలా సార్లు షూటింగ్ పోస్ట్ పోన్ అవడం, యాక్షన్ కొరియోగ్రఫర్లను మార్చడం ఇలా ఎన్నో కారణాలతో గుంటూరు కారం సినిమా లేటవుతూనే ఉంది.
దీంతో షూటింగ్ కు బ్రేక్ వచ్చినప్పుడల్లా మహేష్ ఫారిన్ ట్రిప్‌లకు ఫ్యామిలీతో వెళ్లిపోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లోనే మహేష్ ఎన్ని సార్లు వెకేషన్లకు వెళ్లాడో లెక్కేసుకోవచ్చు. ఇప్పుడు మరోసారి మహేష్ ఫ్యామిలీతో లండన్ వెకేషన్ కు వెళ్లాడు. దీంతో మళ్లీ గుంటూరు కారం సినిమాకు బ్రేక్ పడిందా అని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అసలు సినిమా రిలీజ్ చేసే ఉద్దేశం మీకుందా లేదా అని నెట్టింట ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మహేష్ లేకుండా అయినా షూటింగ్ చేస్తున్నారా లేదా అనేది క్లారిటీ లేదు. ఇప్పటికే పూజా హెగ్డే ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఇప్పుడు మళ్లీ సినిమాటోగ్రఫర్ ని కూడా సినిమా నుంచి తప్పించారంటున్నారు. గుంటూరు కారం జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.













