సెగలు రేపుతున్న గుంటూరు కారం బిజినెస్
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలుండగా, రీసెంట్గా వచ్చిన ఫస్ట్ సింగిల్ తో ఆ అంచనాలు ఇంకా పెరిగాయి.
ఫలితంగా బిజినెస్ కూడా భారీగా పెరిగిందని టాక్. గుంటూరు కారం ఏపీ, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ నుంచి సుమారు రూ.115 కోట్ల దాకా డీల్ కావొచ్చనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పుడు సెగలు రేపుతుంది. కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ కానున్న ఓ కమర్షియల్ మూవీకి ఇంత పెద్ద మొత్తంలో భారీ రేటు పలకడం విశేషం.
దీనికంతటికీ కారనం త్రివిక్రమ్- మహేష్ కాంబో మీదున్న క్రేజే. సంక్రాంతికి భారీ పోటీ నెలకొనడంతో బయ్యర్లు సినిమా కొనే ముందు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి రేసులో పలు క్రేజీ సినిమాలున్నప్పటికీ ఆ ఎఫెక్ట్ మహేష్ మూవీపై ఉండదని బిజినెస్ చూస్తేనే అర్థమవుతుంది. ఇంత భారీ మొత్తంలో బిజినెస్ జరిగిందంటే కనీసం సినిమా రూ. 200 కోట్ల గ్రాస్ దాటేయాలి. మరి వీటన్నింటినీ తట్టుకుని గుంటూరు కారం కమర్షియల్ బ్లాక్బస్టర్ అవుతుందా లేదా అన్నది చూడాలి.













