తమన్ ను టార్గెట్ చేసిన మహేష్ ఫ్యాన్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా పాటలపై మొదటి నుంచి అందరికీ మంచి అంచనాలున్నాయి. త్రివిక్రమ్, తమన్ కాంబోలో మరోసారి మంచి మ్యూజికల్ ఆల్బమ్ రానుందని అందరూ ఈ పాటల కోసం ఎంతగానో ఎదురుచూశారు.
అనుకున్నట్లే మొదటి సాంగ్ ధమ్ మసాలా ఇన్స్‌స్టంట్ చార్ట్‌బస్టర్ గా నిలిచింది. ఇక రీసెంట్ గా గుంటూరు కారం నుంచి రిలీజైన ఓ మై బేబీ సాంగ్‌కు చాలా తక్కువ టైమ్ లోనే పాట మీద నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఓ రేంజ్ లో నెట్టింట హల్చల్ చేసింది. తమన్ పై సోషల్ మీడియా వేదికగా చాలా ట్రోల్స్ కూడా వస్తున్నాయి. మొదటి పాట ఆల్రెడీ ఇప్పటికే హిట్. రెండో పాట కూడా మరీ తీసేసే ట్యూన్ అయితే కాదు.
దాన్ని పట్టుకుని మహేష్ ఫ్యాన్స్ తమన్ ను ట్రోల్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఈ సినిమా నుంచి మరో రెండు పాటలు ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. దాని తర్వాత ట్రైలర్ బ్యాలెన్స్ ఉంది. వీటన్నింటికీ తమన్ పనితీరును చూశాక, నిజంగా తమన్ మంచి అవుట్‌పుట్ ఇవ్వకపోతే ట్రోల్ చేస్తే ఒక అర్థముంటుంది కానీ ఇలా ఒక్క సాంగ్ బాలేదని ఫ్యాన్స్ తొందరపడటం మంచిది కాదు.













