ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన మహేష్
వెంకటేష్, మహేష్ బాబు మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో పెద్దోడు చిన్నోడు అంటూ వీరిద్దరూ భలే పాపులర్ అయ్యారు. ఆ సినిమా తర్వాత మళ్లీ చాలా రోజల తర్వాత ఈ ఇద్దరినీ కలిసి ఒకే స్టేజ్ మీద చూడొచ్చని వెయిట్ చేసిన ఫ్యాన్స్ కు నిన్న జరిగిన వెంకీ75 ఈవెంట్ లో నిరాశే ఎదురైంది.
ఈ ఈవెంట్ కు చిరంజీవితో పాటూ నాగార్జున, బాలకృష్ణ, మహేష్ బాబు కూడా వస్తారని ముందే నిర్వాహకులు చెప్పడంతో మహేష్ ఫ్యాన్స్ ఈ ఈవెంట్ కోసం ఎంతో దూరం నుంచి ఎన్నో కష్టాలు పడుతూ వచ్చి, గంటల తరబడి వెయిట్ చేశారు. తీరా చూస్తే మహేష్ ఈవెంట్ కు రాలేదు. దీంతో మహేష్ ఫ్యాన్స్ కు ఎక్కడ లేని నిరాశ కలిగింది.
మహేష్ ఈ ఈవెంట్ కు రాకపోవడానికి చాలా పెద్ద కారణమే ఉంది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన గుంటూరు కారం షూటింగ్ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. ఇవాళో రేపో సినిమాకు గుమ్మడికాయ కొట్టడానికి త్రివిక్రమ్ చూస్తున్నాడు. ఇలాంటి టైమ్ లో ఈ ఈవెంట్ కు వచ్చి మూడు గంటలు కేటాయించడమంటే మహేష్ కు కుదరని పని. దానికి తోడు ఈవెంట్ టైమ్ కు షూట్ పూర్తవకపోవడం కూడా మహేష్ రాకపోవడానికి కారణంగా తెలుస్తోంది. రీజన్ ఏదైనా సరే మహేష్ ఈ ఈవెంట్ కు రాకపోవడం వల్ల ఆయన ఫ్యాన్స్ హర్ట్ అయ్యారన్నది మాత్రం నిజం.













