దేవీశ్రీపై మహేష్ ఫ్యాన్స్ ఫైర్
నిన్న గచ్చిబౌలి స్టేడియం(Gachibowli Stadium)లో మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ లైవ్ కన్సర్ట్(DSP Live concert) ఎంతో అట్టహాసంగా జరిగింది. దేవీశ్రీ(Devi Sri Prasad) మొదటిసారి ఇండియాలో చేస్తున్న కన్సర్ట్ కావడంతో చాలా స్పెషల్ కేర్ తీసుకుని మరీ ప్రమోషన్స్ చేశారు. టికెట్స్ భారీగా అమ్ముడుపోయి స్టేడియం మొత్తం ఫుల్ అయిపోయింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ కాన్సర్ట్ చాలా బాగా జరిగింది.
కానీ కొందరు హీరోల ఫ్యాన్స్ నుంచి మాత్రం ఈ కాన్సర్ట్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేవీ పాడిన పాటల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu) సాంగ్స్ లేకపోవడంతో మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దేవీపై కామెంట్స్ చేస్తున్నారు. కనీసం 1 నేనొక్కడినే(1 Nenokkadine) లోని హూ ఆర్ యు(Who Are You song) సాంగ్ కూడా మొత్తం పాడలేదని ట్వీట్స్ చేస్తున్నారు.
కాన్సర్ట్ మొత్తం శంకర్ దాదా(shankar dada), అత్తారింటికి దారేది(Atharintiki Daredi), గబ్బర్ సింగ్(Gabbar Singh), పుష్ప(Pushpa), రంగస్థలం(rangasthalam), వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) లోని పాటలు పాడి మెగా సాంగ్స్ కే ప్రాధాన్యం ఇచ్చాడని దేవీపై కామెంట్స్ చేస్తున్నారు. అయితే దేవీ ఇప్పటివరకు చేసిన 105 సినిమాల్లో దాదాపు 25 సినిమాలు మెగా ఫ్యామిలీవే ఉన్నాయి. అవన్నీ ఆల్మోస్ట్ హిట్ ఆల్బమ్సే. అంతమాత్రాన దేవీ కావాలని ఇలా చేశాడంటే ఎలా అని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. రీజన్ ఏదైనా సరే ఆన్ లైన్ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయాన్ని పట్టుకుని దేవీపై నెగిటివిటీ ట్వీట్లు వేస్తున్నారు. ప్రైవేట్ ఈవెంట్ గురించి కూడా ఈ రేంజ్ లో డిస్కస్ చేయడం చూస్తుంటే ఫ్యాన్స్ ప్రతీదీ పర్సనల్ గా తీసుకున్నారని అర్థమవుతుంది.













