తమన్‌పై ఫైర్ అవుతున్న మహేష్ ఫ్యాన్స్
గత కొన్నేళ్లుగా టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా చలామణి అవుతున్న తమన్ పాటలతోనే కాకుండా తన మాటలతో కూడా ఒక్కోసారి ట్రోలింగ్ కు గురవుతుంటాడు. భగవంత్ కేసరి ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ బాబీ, బాలయ్య టీమ్ తో కలిసి చేసిన ఇంటర్వ్యూలో భాగంగా తమన్ చేసిన వ్యాఖ్యలు చాలా తప్పుగా కన్వే అవుతున్నాయి.
ఈ ఇంటర్వ్యూలో తమన్ జీవం లేని సీన్స్ చనిపోయిన శవం లాంటివని, వాటిని మంచి మ్యూజిక్‌తో ఎలివేట్ చేయడం ఎవరి వల్లా కాదని, అనిల్ రావిపూడి మంచి అవుట్ పుట్ ఇచ్చాడు కాబట్టి తను బెస్ట్ ఇవ్వగలిగానని, అఖండకు కూడా అలాగే జరిగిందని చెప్పుకొచ్చాడు. దీంతో తమన్ పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
సర్కారు వారి పాటకు తమన్ ఇచ్చిన మ్యూజిక్ గురించి తనని మహేష్ ఫ్యాన్స్ ఛాన్స్ దొరికినప్పుడల్లా ట్రోల్ చేస్తుంటారు. సినిమాలోని బీచ్ ఫైట్ కు తమన్ బీజీఎం అసలు బాలేదని చాలా సార్లు చెప్పారు ఫ్యాన్స్. అందుకే గుంటూరు కారం సినిమాకు తమన్ పేరు రాగానే వద్దంటే వద్దని నెట్టింట తెగ రచ్చ చేశారు.
ఎలాంటి సినిమాకైనా మ్యూజిక్ డైరెక్టర్ ఒకేలా పనిచేయాలని, ఎన్నో డిజాస్టర్ సినిమాలను చాలా మంది సంగీత దర్శకులు తమ మ్యూజిక్‌తో నిలబెట్టిన దాఖలాలున్నాయి. అంతేకానీ వాళ్లు ఇలా తమన్ చేసినట్టు చచ్చిన శవమని ఎప్పుడూ పోలికలు పెట్టలేదు. తమన్ చెప్పాలనుకున్న పాయింట్ నిజమే కావొచ్చు కానీ ఓ డైరెక్టర్ పనితనాన్ని తాను ఇలా తీసిపడేయడం సరైన పద్దతి కాదు. ఏదేమైనా సరే తమన్ గుంటూరు కారం, గేమ్ చేంజర్ సినిమాలతో తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం చాలా గట్టిగా ఉంది. లేదంటే తనకు ఛాన్సులు తగ్గడం ఖాయం.













