SSMB 28లో మహేష్ బాబు ఫస్ట్ టైం డ్యూయెల్ రోల్ చేయనున్నారా?
సూపర్ స్టార్ మహేష్ బాబు SSMB 28లో తొలిసారి డ్యూయల్ రోల్ ప్లే చేస్తారంటూ ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కనున్న సినిమాలో మహేష్ బాబు డబుల్ యాక్షన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సర్కారు వారి పాట మూవీ సూపర్ సక్సెస్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో SSMB 28 సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమాలో కూడా డ్యూయల్ రోల్ ప్లే చేయలేదు. తొలిసారి ఈ మూవీలో డబుల్ యాక్షన్ చేస్తారని టాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఎపిసోడ్లో మరో మహేష్ బాబు కనిపిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే మూవీ యూనిట్ నుంచి ఈ విషయంపై అధికారిక ఇంకా ప్రకటన రాలేదు.
SSMB 28 మూవీలో పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. మహేష్ బాబు డ్యూయల్ రోల్ చేస్తారని.. కథ ప్రకారం రెండో హీరోయిన్ కూడా అవసరమవ్వడంతో మూవీ మేకర్స్ ఆ పనిలో ఉన్నారంటూ టాక్ వస్తోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్నారు. మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆగష్టు నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో మూడో సినిమా ఇది గతంలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. అతడు మూవీ ఆల్ టైం హిట్‌గా సాధించగా.. ఖలేజా సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. మళ్లీ దాదాపు పుష్కరకాలం తరువాత వీరిద్దరి కాంబినేషన్ సెట్ కావడంతో అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీ తరువాత మహేష్-జక్కన్న కాంబినేషన్లో భారీ మూవీ రానుంది.













