11 మిలియన్ ఫాలోవర్స్ సొంతం చేసుకున్న మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు రోజు రోజుకు అశేష ప్రేక్షకాదరణ పొందుతున్నాడు. ముఖ్యంగా అతనిని సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారి సంఖ్య క్రమేపి పెరుగుతూ పోతుంది. తాజాగా మహేష్‌కు ట్విట్టర్ లో 11 మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చి చేశారు. దీంతో ట్విట్టర్ లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న సౌత్ హీరో గా మహేష్ రికార్డ్ సాధించారు. మహేష్ సాధించిన ఈ రికార్డ్ పట్ల సంతోషం వ్యక్తం చేసిన మహేష్ ఫ్యాన్స్ #11millionmaheshians అనే హ్యష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
మహేష్‌కు ఇన్ స్టాగ్రాంలో 6.1 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా, ఫేస్ బుక్‌లో 5.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సర్కారు వారి పాట అనే చిత్రంలో మహేష్ బిజీగా ఉండగా, ఈ సినిమా జనవరి నుండి షూటింగ్ జరుపుకోనుంది. కీర్తి సురేష్ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. బ్యాంకులలో జరుగుతున్న అక్రమాలకు సంబంధించిన నేపథ్యంలో పరశురాం ఈ చిత్రం తెరకెక్కించనున్నట్టు సమాచారం.













