సూపర్ స్టార్ కు అరుదైన గౌరవం
తెలుగు సూపర్‌స్టార్ మహేష్ బాబుకు అరుదైన గౌరవం దక్కనుంది. గత ఏప్రిల్‌లో మహేష్ బాబు మైనపు బొమ్మను తయారు చేస్తున్నట్లు ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్ ప్రకటించింది. ముందుగా అనుకున్నట్లే ఆ మైనపు బొమ్మ తయారీ పూర్తిచేసింది. మలేషియాలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అతి త్వరలో మహేష్ బాబు మైనపు ప్రతిమ కొలువుదీరనుంది. ఈలోగా ఆ మైనపు ప్రతిమను హైదరాబాద్‌లో ఒకరోజు ప్రదర్శించాలని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్ నిర్వాహకులు నిర్ణయించారు. ఇలా ఒక నటుడి మైనపు ప్రతిమను సొంత నగరంలో అభిమానుల మధ్య ప్రదర్శించడం మేడమ్ టుస్సాడ్స్ సంస్థకు ఇదే తొలిసారి. ఈ విధంగా మహేష్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి అనే చిత్రంలో నటిస్తున్నారు.













