Mahesh Babu: వెకేషన్ ముగించుకుని హైదరాబాద్‌కు వచ్చిన మహేష్
ప్రస్తుతం రాజమౌళి(Rajamouli) హీరోగా మహేష్ బాబు(Mahesh babu) దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబీ29(SSMB29) టైటిల్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. సినిమాను కనీసం అనౌన్స్ కూడా చేకుండా రాజమౌళి ఎస్ఎస్ఎంబీ29ను మొదలుపెట్టి ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ షూటింగ్స్ ను కూడా పూర్తి చేసిన రాజమౌళి ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ ఇచ్చాడు.
ఈ బ్రేక్ లో రాజమౌళి తన డాక్యుమెంటరీ ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్(RRR: Behind and Beyond) ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లి అక్కడ మీడియాతో ముచ్చటిస్తే, మహేష్ దొరికిందే ఛాన్స్ అన్నట్టు తన ఫ్యామిలీతో వెకేషన్ కోసం రోమ్ వెళ్లాడు. వెకేషన్ కు వెళ్తూ మహేష్ ఎయిర్‌పోర్టులో తన పాస్‌పోర్టును చూపిస్తూ ఫోటోగ్రాఫర్లకు ఇచ్చిన పోజు నెట్టింట వైరల్ కూడా అయింది.
ఇదిలా ఉంటే వెకేషన్ కు వెళ్లిన మహేష్ ఇప్పుడు తిరిగి హైదరాబాద్ వచ్చేశాడు. త్వరలోనే జక్కన్నతో కలిసి సెట్స్ లో జాయిన్ అవడానికి మహేష్ రెడీ అవుతున్నాడు. ఎస్ఎస్ఎంబీ29కు సంబంధించిన నెక్ట్స్ షెడ్యూల్ త్వరలోనే మొదలయ్యే అవకాశాలున్నాయి. ప్రియాంక చోప్రా(Priyanka Chopra), పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి(Keeravani) సంగీతం అందించనుండగా, కె.ఎల్ నారాయణ(KL Narayana) ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.













