రాముడిగా మహేష్.. రావణుడిగా హృతిక్ ?
టాలీవుడ్ సినీ ఇండిస్టీలో ఇతిహాసాల పర్వం మొదలైంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, నమిత్ మల్హోత్ర, మధు మంతెన గతంలో రామాయణ గాథను భారీ హంగులతో అంతర్జాతీయ స్థాయిలో త్రీడీలో తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రానికి దంగల్ ఫేం నితీశ్ తివారీ, మామ్ ఫేం రవి ఉద్యవార్లు దర్శకత్వం వహించనున్నారు. మూడు భాగాలుగా ఈ రామాయణ గాథను తెరకెక్కించనున్నట్టు తెలుస్తుండగా ఇందులో రాముడిగా మహేష్ బాబు, రావణుడిగా హృతిక్ రోషన్‌ను ఫైనల్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాను సుమారు 150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్లు సమాచారం. 2022లో పట్టాలెక్కనున్న ఈ ప్రాజెక్టు 2024లో విడుదల కానుంది.













