రాజమౌళితో సినిమా కంటే ముందే మరో సినిమా
రీసెంట్ గా సర్కారు వారి పాట దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసి బ్రేక్ లో ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్. ఈ సినిమా తర్వాత మహేష్ ఏం చేస్తారనేది ఇంకా క్లారిటీ లేదు. మహేష్ ఖాళీ టైమ్ లో పలువురు దర్శకులతో చర్చలు అయితే జరుపుతున్నాడు కానీ తర్వాతి సినిమా విషయం గురించి తొందరగా అయితే లేడు. సుధా కొంగర, రాధేశ్యామ్ డైరక్లర్ రాధాకృష్ణకుమార్ వినిపించిన స్క్రిప్ట్ లను తిరస్కరించాడని టాక్. నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యేలోపు కథలను వినాలని డిసైడ్ అయ్యాడట సూపర్ స్టార్.
వాస్తవానికి ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి సినిమా చేయాల్సి ఉంది. కానీ రాజమౌళి సినిమా కంటే ముందుగా మరో సినిమా పూర్తి చేయాలనే ఆలోచనలో మహేష్ ఉన్నాడట. అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల లు ఈ వారంలో మహేష్ ను కలిసి స్టోరీ నెరేట్ చేయనున్నారట. మార్చ్ మధ్యలో నుంచి సర్కారు వారి పాట తదుపరి షెడ్యూల్ మొదలుకానుంది. ఈ లోపు స్క్రిప్ట్స్ విని తన తర్వాతి సినిమాను మహేష్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.













