యూఎస్ కాన్సుల్ జనరల్ ను కలిసిన మహేశ్ బాబు
అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు నటిస్తున్న చిత్రం మహర్షి. వంశీ ఫైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. ఈ చిత్రం షూటింగ్ త్వరలో న్యూయార్క్‌లో జరగనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సుల్ జనరల్ కేథరిన్ హడ్డాను మహేశ్, వంశీ కలిశారు. ఈ మేరకు వారితో కలిసి దిగిన ఫొటోలను ట్విటర్ వేదికగా షేర్ చేశారు. నా స్వస్థలం న్యూయార్క్‌లో ఎవరు తమ తర్వాతి సినిమా షూటింగ్ చేస్తున్నారో చూడండి? అంటూ మహేశ్, వంశీలను ట్యాగ్ చేశారు. దీంతోపాటు యూఎస్ ఇండియా దోస్తీ అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జత చేశారు. కేథరిన్‌కు వంశీ రిప్లై ఇస్తూ, మీతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది మేడమ్. మీరు చూపిన ప్రేమకు ధన్యవాదాలు అని అన్నారు. న్యూయార్క్‌లో పదిహేను రోజుల పాటు కీలక సన్నివేశాలు, పాటల్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అశ్వనీ దత్, దిల్‌రాజ్ నిర్మాతలు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయనున్నారు.













