మరోసారి మహేష్ తో మిల్కీ బ్యూటీ..
ఆగడు లో హీరోయిన్ గా నటించిన తమన్నా.. ఆ తర్వాత సరిలేరు నీకెవ్వరు లో కూడా ఒక స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఇప్పుడు మరోసారి మహేష్ సరసన నటించేందుకు తమన్నా జాక్ పాట్ కొట్టిందా అంటే అవుననే అంటున్నారు. అయితే ఈసారి స్పెషల్ సాంగ్ కోసం కాదట.. వీరిద్దరూ కలిసి నటిస్తున్నారట. అయితే ఇది సినిమా కోసం కాదు, టీవీ ప్రకటన కోసమట. ఒక పాపులర్ కంపెనీ పరుపుల యాడ్ కోసం వీరిద్దరూ కలిసి నటించబోతున్నారట.
ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ఈ యాడ్ లో తమన్నా లుక్ కూడా డిఫరెంట్ గానే కనిపిస్తుందట. ఒక వైపు సర్కారు వారి పాట షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్, మరోవైపు ఇలా గ్యాప్ లో యాడ్స్ షూట్ లో పాల్గొంటున్నారు. సీటీ మార్, అంధదూన్ తెలుగు రీమేక్ లో తమన్నా నటిస్తున్న విషయం తెలిసిందే. కమర్షియల్ యాడ్స్ పరంగా మహేష్, తమన్నా లు బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ చేస్తూ బానే సంపాదిస్తున్నారు.













