SSMB29: ఒకే ఫ్రేమ్ లో మహేష్, ప్రియాంక
మహేష్ బాబు(mahesh babu) హీరోగా రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఎస్ఎస్ఎంబీ29(SSMB29). ఫారెస్ట్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఓ ప్రీ లుక్ ను రిలీజ్ చేయగా, ఫస్ట్ లుక్ నవంబర్ నెలలో రిలీజ్ చేస్తామని దర్శకుడు రాజమౌళి వెల్లడించిన విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా(priyanka chopra) ఓ కీలక పాత్ర లో నటిస్తుందని ఇప్పటికే చాలా రకాల వార్తలొచ్చిన విషయం తెలిసిందే. కానీ ఎస్ఎస్ఎంబీ29(SSMB29)లో ప్రియాంక ఉందనే విషయాన్ని ఇటు రాజమౌళి కానీ అటు చిత్ర యూనిట్ కానీ అనౌన్స్ చేసింది లేదు. అయితే తాజాగా ఈ సినిమాలో ప్రియాంక నటిస్తుందనే విషయంలో క్లారిటీ వచ్చేసింది.
తాజాగా మహేష్, ప్రియాంక కలిసి దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలోకి రాగా అది క్షణాల్లో వైరల్ అయిపోయింది. వీరిద్దరూ కలిసి గతంలో ఎప్పుడూ సినిమా చేసింది లేదు. దీంతో వీరిద్దరూ కలిసి దిగిన మొదటి ఫోటో ఇదే అయింది. రీసెంట్ గా మహేష్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో వీరు ఈ ఫోటో దిగారని అందరూ భావిస్తున్నారు. ఫోటోలో వీరిద్దరినీ చూశాక ఎప్పుడెప్పుడూ వీరిని ఆన్ స్క్రీన్ పై చూస్తామా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.







