పరశురామ్‌ని టార్గెట్ చేస్తున్న ఆ ఇద్దరి ఫ్యాన్స్
సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమా ఛాన్స్ కొట్టేయడంతో దర్శకుడు పరశురామ్ రేంజ్ మారిపోయిందనుకున్నారు అందరూ. కానీ ఆ సినిమా మహేష్ స్టేటస్ కు తగ్గ విజయాన్నివ్వలేదు. డిజాస్టర్ కాలేదనే సంతోషం తప్పించి, ఫ్యాన్స్ కు కావాల్సిన సినిమా కాదు. ఈ సినిమా కంటెంట్ పరంగా కూడా అప్పట్లో చాలానే రూమర్స్ వచ్చాయి.
అప్పటి నుంచి బయటెక్కడా మీడియాకు కనిపించకుండా తిరుగుతున్నాడు పరశురామ్. రీసెంట్గా దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండతో మూవీ అనౌన్స్మెంట్ వరకు తన పేరు కూడా ఎక్కడా వినిపించింది లేదు. అది కూడా పెద్ద గొడవే జరిగింది. తనకు మాటిచ్చి తప్పాడనే కోపంతో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఓ ప్రెస్ మీట్ సాక్షిగా పరశురామ్ ను నిలదీద్దామని అందరికీ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చి దాన్ని ఆపేసిన విషయం అందరికీ తెలిసిందే.
అందరి దగ్గర అడ్వాన్సులు తీసుకుని, తర్వాత మంచి ప్రాజెక్ట్ ఏదైతే దానికి తన స్వార్థం చూసుకుని మారిపోతాడని పరశురామ్ మీద ఎప్పటినుంచో ఓ టాక్ ఉంది. దీనికి తోడు రీసెంట్గా నాగ చైతన్య పరశురామ్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పరశురామ్ గురించి మాట్లాడమే అసలు వృధా అని చైతూ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఓ పేరున్న డైరెక్టర్ ఇలా ఓపెన్‌గా విమర్శకు గురవడం ఈ మధ్య కాలంలో ఇదే. చైతూ కామెంట్ల తర్వాత ఇటు చైతూ ఫ్యాన్స్, అటు మహేష్ ఫ్యాన్స్ పరశురామ్ పై ట్వీట్స్, మీమ్స్, కొటేషన్స్ తో కార్నర్ అతణ్ణి టార్గెట్ చేస్తున్నారు. ఎప్పుడూ సాఫ్ట్ గా ఉంటే చైతూ బహిరంగంగా ఇలా మాట్లాడంటే పరశురామ్ ఎంతలా తనను వెయిట్ చేయించాడో, ఎంత అసహనానికి గురయ్యేలా చేశాడో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా పాపం పరశురామ్ ఇన్నాళ్లూ బయటకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నా ఇలా దొరికిపోవడం బాధాకరమే.













