మహేష్ బాబు బోనీ తో పాన్ ఇండియా మూవీ కి బోణి కొట్టబోతున్నాడా?
బాహుబలి సినిమా తర్వాత మన తెలుగు సినిమా పై ఎక్కువగా బాలీవుడ్ దృష్టి పెడుతూ వస్తుంది. తెలుగులో స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్న ప్రతీ సారి… అక్కడి నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడి హీరోలతో సినిమాలు చేయాలని అక్కడి దర్శక నిర్మాతలు ఎక్కువగా ఉందనే ప్రచారం మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అయితే అక్కడి హీరోలు, దర్శకులు మాత్రం తెలుగులో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదు. ఈ క్రమంలోనే మన తెలుగు హీరోలు మాత్రం ఇక్కడి దర్శకులతో అక్కడి నిర్మాతలతో ఎక్కువగా సంప్రదింపులు జరుపుతూ వస్తున్నారు.
ముఖ్యంగా ప్రభాస్ వంటి హీరో మాత్రం అక్కడి దర్శక నిర్మాతలతో ఎక్కువగా చర్చలు జరుపుతున్నారు. ఆయన ఇప్పుడు బాలీవుడ్ లో దాదాపు వంద కోట్ల వరకు బడ్జెట్ పెట్టి ఒక సినిమా చేసే అవకాశం ఉందనే వార్తలు గత రెండు మూడు రోజుల నుంచి మనం చూస్తున్నాం. భూషణ్ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ప్లాన్ చేశాడని వార్తలు వచ్చాయి. ప్రభాస్ వార్తను పక్కన పెడితే మరో విషయం టాలీవుడ్ లో ఎక్కువగా హల్చల్ చేస్తోంది. అది ఏమిటి అంటే మహేష్ కూడా ఇప్పుడు బాలీవుడ్ లో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. మహేష్ కి పాన్ ఇండియా సినిమాలంటే కాస్త భయం ఎక్కువగా ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే పెట్టుబడి పెట్టే అవకాశం లేదు. కానీ మహేష్ బాబు మాత్రం అక్కడ ఒక సినిమా చేయడానికి, ఆసక్తి చూపిస్తున్నాడని త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి చర్చలు కూడా జరిగే అవకాశం ఉందని అంటున్నారు. బోనీ కపూర్ తో కలిసి ఒక సినిమాను బాలీవుడ్ లో ఆయన ప్రయత్నాలు చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన చర్చలు కూడా జరిగే అవకాశం ఉందని, బోనికపూర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే .













