మహేష్28 ఇంట్రెస్టింగ్ టైటిల్..
మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మహేష్ కెరీర్లో 28వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. హారికా & హాసినీ క్రియేషన్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే మహేష్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అతడు, ఖలేజాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ రెండు సినిమాల తర్వాత వీరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గరనుంచే దీనిపై భారీ హైప్ నెలకొంది.
ఈ సినిమాకు అమరావతికి అటు ఇటు అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టుగా ఇప్పుడు లీకులు అందుతున్నాయి. త్రివిక్రమ్ తన రెగ్యులర్ సెంటిమెంట్‌ని విడవకుండా అ అక్షరంతో మొదలయ్యేలా మళ్లీ జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది. ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ ఈ టైటిల్ ఆల్మోస్ట్ ఫిక్స్ అని సమాచారం. అయితే ఈ టైటిల్ వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీనే ఉందట. గుంటూరు బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమరావతికి చెరో వైపున హీరోకు సంబంధించిన వాళ్ల ఊళ్లలో ఉండే రెండు కుటుంబాల స్టోరీగా త్రివిక్రమ్ దీన్ని తీర్చిదిద్దాడని టాక్.
స్టోరీ లైన్ పరంగా ఏం కొత్తగా లేకపోయినా దానికి త్రివిక్రమ్ తన టచ్ ఇచ్చి మూవీని స్ట్రాంగ్ గా తయారుచేస్తాడు. విలేజ్ నేపథ్యం కాబట్టి విలేజ్‌లోనే కావాల్సినంత వినోదాన్ని సినిమాలో సెట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఆగస్టు 11కు రావడం అయితే అనుమానంగానే కనిపిస్తుంది. మొత్తానికి టైటిల్‌ని హీరో మీద కాకుండా కాన్సెప్ట్ మీద పెట్టడంలో త్రివిక్రమ్ తన మార్కును మరోసారి చూపించాడు.













