ఉగాది కానుకగా మహర్షి టీజర్
సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటిస్తున్న 25వ చిత్రం మహర్షి. టీజర్ కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎట్టకేలకు ఈ టీజర్‌ను ఏప్రిల్ 6న ఉగాది కానుకగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే మహేష్ దానికి సంబంధించిన డబ్బింగ్‌ను కంప్లీట్ చేశారు. టీజర్ గురించి అధికారిక ప్రకటన రానుంది. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మహేష్‌కు జోడీగా పూజాహెగ్డే నటిస్తుండగా ప్రముఖ హీరో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్‌రాజు, అశ్వినీదత్, పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం మే 9న విడుదల కాబోతోంది.













