మే 1న మహర్షి ప్రీ రిలీజ్ వేడుక
మహేష్‌బాబు మహర్షిగా నటించిన చిత్రం ప్రీ రిలీజ్ వేడుక మే 1న జరగనుంది. భరత్ అనే నేను తరహాలో ఈ చిత్రం వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వేడుకకు ఇప్పటివరకు మహేష్‌బాబును డైరెక్ట్ చేసినవారిని ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తున్నారు. బాలనటుడిగా నటించిన సినిమాలు మినహాయిస్తే.. రాజకుమారుడు మొదలుకొని మహర్షి వరకు ఇప్పటికి మహేష్ 24 చిత్రాల్లో నటించారు. అందులో గుణశేఖర్ 3 చిత్రాలకు, పూరి జగన్నాథ్, త్రివిక్రమ్, శ్రీనువైట్ల, శ్రీకాంత్ అడ్డాల రెండేసి చిత్రాలకు దర్శకత్వం వహించారు. బాబీ చిత్ర దర్శకుడు శోభన్ అకాలమరణం పొందారు. మహేష్‌బాబుకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు వంటి సూపర్‌హిట్స్ ఇచ్చిన దిల్‌రాజు మొదటి చిత్రం రాజకుమారుడుతోపాటు, సైనికుడు వంటి ప్లాప్ ఇచ్చిన అశ్వినీదత్-బ్రహ్మూెత్సవం వంటి డిజాస్టర్ ఇచ్చిన పి.వి.పి సంయుక్తంగా నిర్మిస్తున్న మహర్షి చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్‌తో వంశీకిది తొలి చిత్రం. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నారు. మే 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.













