మహారాజా డైరెక్టర్ నెక్ట్స్ ఆమెతోనా?
ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ కిల్లర్ గా వచ్చి బ్లాక్ బస్టర్ అయిన విజయ్ సేతుపతి సినిమా మహారాజా తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. సేతుపతి టాలీవుడ్ లో సోలో హీరోగా అందుకున్న ఫస్ట్ డబ్బింగ్ హిట్ ఇదే. అన్ని భాషలు కలిపి ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ వంద కోట్లు గ్రాస్ దాటేసింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా డైరెక్టర్ నితిలన్ స్వామి నాథన్ ఇప్పుడు తన తర్వాతి సినిమాకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. టైటిల్ ను మహారాణిగా పెట్టినట్లు సమాచారం. జానర్ మార్చకుండా మహారాజాకు మించి ఈ సారి థ్రిల్స్, కట్టిపడేసే స్క్రీన్ ప్లే తో స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నాడట. టైటిల్ రోల్ కోసం నయనతారను సంప్రదిస్తే సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
ఈ సినిమా నిర్మాణం కూడా ఫ్యాషన్ స్టూడియోస్ బ్యానర్ లోనే జరగొచ్చని టాక్. సౌత్ లో మంచి డిమాండ్ ఉన్న నయనతార లాంటి హీరోయిన్ ను పెట్టి ఈసారి నితిలన్ ఎలాంటి ప్రయత్నం చేస్తాడో చూడాలి. ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిగాయి. నయనతార కూడా కథ విని సానుకూలంగా స్పందించిందని తెలుస్తోంది.













