మహానటి మరో అరుదైన ఘనత
అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మహానటి. గత ఏడాది మే లో విడుదలై బయోపిక్ చిత్రాల్లో ట్రెండ్ సెట్‌గా నిలిచింది. కీర్తిసురేష్ ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. తాజాగా మరో రేర్‌ఫీట్‌ను సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మక షాంగై ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైన ఇండియన్ సినిమాగా ఘనత సాధించిది. చైనాలో షాంగైలో జూన్ 14 నుంచి 24 వరకు జరిగే ఈ ఫెస్టివల్లో మహానటి సినిమాను ప్రదర్శించనున్నారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ ముఖ్యపాత్రల్లో నటించిన సంగతి విదితమే. వై జయంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.













