సినీనటి రేవతికి సావిత్రి అవార్డు
ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసిన మహానటి సావిత్రి పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందని సినీనటి రేవతి అన్నారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మహానటి సావిత్రి, అమర గాయకుడు ఘంటసాల జీవిత సాఫల్య పురస్కారాల సభ జరిగింది. సావిత్రి పురస్కారంతో రేవతిని, ఘంటసాల పురస్కారంతో గాయకుడు కృష్ణ చైతన్యను ఘనంగా సత్కరించారు. రేవతి మాట్లాడుతూ.. సావిత్రి పురస్కారం అందుకోవడం తన పూర్వ జన్మ సుకృతం అన్నారు. కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఘంటసాల జీవిత చరిత్ర సినిమాలో ఘంటసాల పాత్ర ధరించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.













