మహానటికి మరో అవార్డు
సావిత్రి జీవితకథతో తెరకెక్కిన మహానటి చిత్రానికి అనేక ప్రశంసలు దక్కాయి. అద్భుతమైన చిత్రంగా ప్రేక్షకులు కొనియాడారు. ఇప్పుడు విదేశాల్లో కూడా ఈ చిత్రానికి ఆదరణ లభిస్తోంది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెలోబోర్న్కు ఎంపికైంది. ఈక్వెలిటి ఇన్ సినిమా అవార్డు సొంతం చేసుకుంది. మహానటి టీమ్ దర్శకుడు నాగ్ అశ్విన్, హీరోయిన్ కీర్తిసురేష్, నిర్మాతలు స్వప్న, ప్రియాంక దత్ ఈ వేడుకకు హాజరై అవార్డు అందుకున్నారు. ఓ అద్భుతమైన చిత్రం నిర్మించి ఈ అవార్డు అందుకున్నందుకు ఆనందంగా ఉందని అని నిర్మాత స్వప్నదత్ పేర్కొన్నారు. మహానటి కేవలం ఇండియాలోనే కాదు విదేశాల్లో అద్భుతమైన విజయం సాధించిందని చెప్పారు. ఈ సినిమా నిర్మించినందుకు గర్వంగా ఉందని అన్నారు. మహానటి పాత్నని పోషించిన కీర్తి సురేష్ ఉత్తమ నటి కెటగీరిలో నామినేట్ అయ్యారు.













