వారందరికీ ఇది అంకితం
ఇటీవల ప్రకటించిన నేషనల్ అవార్డ్సులో అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి మూవీ ఏకంగా మూడు విభాగాల్లో వార్డులు గెల్చుకుని సత్తా చాటింది. ఈ చిత్రంలో సావిత్రిగా నటించిన కీర్తిసురేష్ ఉత్తమ నటిగా ఎంపికైంది. ఈ సందర్భంగా మీడియాకు ఆమె స్పందన తెలియజేశారు. ఈ అవార్డు నటిగా రాణించటానికి మద్దతు ఇచ్చిన నా కుటుంబానికీ, గురువుగారైన ప్రియదర్శన్ గారికి, నా ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులకు అంకితం ఇస్తున్నాను. అలాగే మహానటి గురించి గొప్పగా రాసి, ప్రజల్లో వెళ్లేలాచేసిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు అని అన్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు ప్రియాంకా దత్, స్వప్నదత్‌లకు, సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా తోటినటీ నటుల నటనను కొనియాడారు













