26 రోజులు.. 26 కోట్ల షేర్!
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన మహానటి మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ ఈ సినిమా విజయవిహారం చేసింది. ఈ సినిమా విడుదలైన 26 రోజుల్లో 26 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేయడం విశేషం. కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఒక సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం విశేషంగా చెబుతున్నారు. సావిత్రి జీవితంలోని విషాద సంఘటనలు, ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులను గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిని చూపడం, సీనియర్ నటీనటులతో పాటు, క్రేజ్ వున్న ఈ తరం నటీనటులు నటించడం, నాగ్ అశ్విన్ దర్శక ప్రతిభ ఈ సినిమాకి ఈ స్థాయి విజయాన్ని అందించాయి. మహానటి తరువాత చెప్పుకోదగిన సినిమా విడుదల కాకపోవడం కూడా ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడానికి మరో కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.













