అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న రవితేజ కొడుకు
వేరే క్రాఫ్ట్స్ కు చెందిన వారసులు కూడా యాక్టింగ్ వైపు అడుగులేస్తున్న ఈ రోజుల్లో హీరోల కొడుకులు హీరోలు కాకుండా ఇంకేమవుతారులే అనుకుంటే పొరపాటే. కొద్దిమంది మాత్రం తమ రూటే సపరేటు అన్నట్లు తమ ఫ్యూచర్ ను ప్లాన్ చేసుకుంటుంటారు. తమిళ స్టార్ హీరో విజయ్(Vijay) కొడుకు డైరెక్షన్ వైపు అడుగులేస్తున్న విషయం తెలిసిందే.
సందీప్ కిషన్(Sundeep Kishan) హీరోగా అతని దర్శకత్వంలో సినిమా కూడా చేయబోతున్నాడు. ఫ్యూచర్ లో కూడా డైరెక్టర్ గానే కొనసాగుతాడా లేదా అనేది తెలియదు కానీ ప్రస్తుతానికి మాత్రం రవితేజ(Ravi Teja) కొడుకు మహాధన్ భూపతి రాజు(Mahadhan Bhupathi Raju) కూడా డైరెక్షన్ మీదే తన దృష్టి సారించినట్లు సమాచారం. సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దగ్గర మహాధన్ దర్శకత్వంలో మెలకువలు నేర్చుకుంటున్నాడట.
ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు సందీప్ రెడ్డి వంగా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాడట. అయితే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నంత మాత్రాన అదే పని చేయాలనేమీ లేదు. రవితేజ కూడా ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గానే పని చేసి ఆ తర్వాత యాక్టింగ్ లోకి వచ్చి హీరోగా సెటిలైపోయాడు. మరి భవిష్యత్తులో మహాధన్ హీరో అవుతాడా లేదా డైరెక్టర్ గా ఉంటాడా అనేది చూడాలి.













