మహా సముద్రం స్టోరీ లైన్ ఇదే..!
ఆరెక్స్ 100 సినిమా తర్వాత ఎంతో గ్యాప్ తో అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా మహా సముద్రం. తమిళ సీనియర్ స్టార్ సిద్ధార్థ్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న మహాసముద్రం కథ చాలా విభిన్నంగా ఉంటుందని మొదటి నుంచి ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.
ఆగస్టు లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు కూడా. ఇలాంటి టైమ్ లో మహా సముద్రం సినిమా కథ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ గురించి ప్రచారమవుతుంది. చిన్న వయసులో ఇద్దరు కుర్రాళ్లు ఏవో కారణాలతో ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకోవడం, వాళ్లు పెరిగి పెద్దయ్యే సరిక ఆ ద్వేషం కాస్త పెరిగి పగగా మారుతుందట. వీటితో పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్, ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ కూడా ఈ సినిమాలో ఉంటుందంటున్నారు. ఆరెక్స్ 100 తర్వాత గ్యాప్ తీసుకుని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాతో మరో హిట్ కొట్టాలని అజయ్ భూపతి ఉవ్విళ్లూరుతున్నాడు.













