మాస్ట్రో నుంచి వెన్నెల్లో ఆడపిల్ల … విడుదల
నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మాస్ట్రో. మేర్లపాక్ గాంధీ దర్శకుడు. ఎన్.సుధాకర్ రెడ్డి, నిఖితారెడ్డి నిర్మాత. ఓటీటీలో విడుదల కానుంది. ఈ సినిమాలోని వెన్నెల్లో ఆడపిల్ల అనే మెలోడీ గీతాన్ని విడుదల చేశారు. మహతిస్వరసాగర్ సంగీతాన్నందించిన ఈ పాటను స్వీకర్ అగస్తి ఆలపించారు. గోవా నేపథ్యంలో ఈ గీతాన్ని తెరకెక్కించారు. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందించాం. ఓ అంధుడైన పియానో ప్లేయర్ జీవితంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ప్రేమకథ కూడా మెప్పిస్తుంది అన్నారు. నభా నటేష్, తమన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జే.యువరాజ్, నిర్మాణ సంస్థ: శ్రేష్ఠ్ మూవీస్, సంభాషణలు, దర్శకత్వం: మేర్లపాక గాంధీ.













