మాస్ట్రో బ్రాండ్ న్యూ పోస్టర్
హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం మాస్ట్రో. టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్వకత్వంలో బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రం డైరెక్టర్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ప్రముఖ డిజిటల్ సంస్థ డిస్నీ హాట్ స్టార్‌లో విడుదలవుతున్న ఈ సినిమా నితిన్‌కు ల్యాండ్ మార్క్ 30వ చిత్రం. నభా నటేశ్ ఇందులో హీరోయిన్గా నటిస్తే, తమన్నా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చిత్ర యూనిట్ నితన్, తమన్నా కాంబినేషన్లో ఓ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో నల్ల కళ్లద్దాలతో భయపడుతూ నిల్చున్న నితిన్, అతని పక్కనే గన్ పట్టుకుని నిలబడ్డ తమన్నా ఆకట్టుకుంటున్నారు. రాజ్‌కుమార్ అకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ఎన్. సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి ఈ చిత్రానికి నిర్మిస్తున్నారు.













