Spirit: స్పిరిట్ లో మలయాళ భామ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. ఓ వైపు రాజా సాబ్(raja saab) సినిమాను పూర్తి చేస్తున్న ప్రభాస్, మరోవైపు హను రాఘవపూడి(hanu raghavapudi) దర్శకత్వంలో ఫౌజీ(Fauji) చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత డార్లింగ్, సందీప్ రెడ్డి వంగా(sandeep reddy Vanga) దర్శకత్వంలో స్పిరిట్(spirit) సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి ఆ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతాడు.
యానిమల్(animal) తర్వాత సందీప్ నుంచి వస్తున్న సినిమా కావడంతో స్పిరిట్ పై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా స్పిరిట్ ను తీర్చి దిద్దాలని చూస్తున్నాడు సందీప్. స్పిరిట్ లో ప్రభాస్ కు జోడీగా యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రీ(tripti dimri)ని ఆల్రెడీ హీరోయిన్ గా ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉందని తెలుస్తోంది.
స్పిరిట్ మూవీలో మలయాళ భామ మడోనా సెబాస్టియన్(madonna sebastian) నటించనుందని టాక్ వినిపిస్తుంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేసిన మడోనా, తన పాత్ర బావుంటే ఎంత చిన్న రోల్ అయినా చేయడానికి వెనుకాడదు. మరి ప్రభాస్ సినిమాలో అమ్మడు ఎలాంటి రోల్ చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఆల్రెడీ స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను పూర్తి చేసుకుని ప్రభాస్ కోసం సందీప్ వెయిట్ చేస్తున్నాడు.