Madhu Chopra: ప్రియాంక కోసం ఓ అబ్బాయి గోడ దూకాడు: తల్లి మధు చోప్రా
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ లెవెల్ కు ఎదిగిన ప్రియాంక చోప్రా(Priyanka Chopra) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు ఉన్న క్రేజ్ మామూలుది కాదు. అందుకే దాన్ని వాడుకోవాలని రాజమౌళి(Rajamouli) పెద్ద ప్లాన్ వేసి మహేష్(Mahesh Babu) మూవీ కోసం తీసుకున్నాడు. అయితే ప్రియాంకకు ఈ ఫాలోయింగ్, క్రేజ్ హీరోయిన్ అయ్యాక వచ్చినవేమీ కాదట.
ప్రియాంక చిన్నప్పటి నుంచే ఎంతోమంది అబ్బాయిలు తన వెంట పడేవారని ప్రియాంక తల్లి మధు చోప్రా(Madhu Chopra) రీసెంట్ గా తెలిపారు. ప్రియాంక ఈ స్థాయికి రావడానికి ఎన్నో సవాళ్లు ఎదుర్కొందని చెప్పారు. ప్రియాంక చిన్నప్పుడు కొంతకాలం యూఎస్ లో ఉండటం వల్ల అక్కడి కల్చర్ అలవాటై ఎక్కువగా వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకునేదని, ఆ కారణంతో ప్రియాంక వెనుక యూత్ ఎగబడేవారని తెలిపింది.
అంతేకాదు, ఓసారి ఒక అబ్బాయి ప్రియాంక కోసం తమ ఇంటి గోడ కూడా దూకాడని, దాంతో భయపడి, వెంటనే ప్రియాంక వాళ్ల నాన్న ఇంటి చుట్టూ ఐరన్ రాడ్స్ తో ఫెన్సింగ్ వేయించినట్టు చెప్పిన మధు చోప్రా, ఆ తర్వాత నుంచి ప్రియాంక కొన్నాళ్ల పాటూ వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకోవడం మానేసి సల్వార్ కమీజ్ లు వేసుకుందని తెలిపారు.













