Madarasi: మురుగదాస్ మదరాసి రిలీజ్ అప్డేట్
మాస్ అండ్ కమర్షియల్ చిత్రాలే కాకుండా సమాజానికి మంచి సందేశం ఇవ్వడంలో దర్శకుడు మురుగదాస్(Murugadoss) ముందుంటాడు. అతడి డైరెక్షన్లో సల్మాన్ ఖాన్(salman Khan) హీరోగా తాజాగా వచ్చిన సికందర్(sikander) సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. భారీ అంచనాలతో వచ్చిన సికందర్ ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు మురగదాస్ ఫోకస్ తన తదుపరి చిత్రంపై పెట్టాడు.
కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan)తో మురుగదాస్(Murugadoss) తన తర్వాతి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకు మదరాసి(madarasi) అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ 80 శాతం పూర్తయిందని సమాచారం. వేసవిలో బ్యాలెన్స్ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో చిత్ర బృందం బిజీగా ఉంది. రెండు నెలలు బాగా ప్రమోషన్స్ నిర్వహించి ఆతర్వాత ఈ చిత్రాన్ని సెప్టెంబరు 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు కోలీవుడ్ మీడియా వర్గాల నుంచి తెలుస్తోంది.
అనిరుధ్(anirudh) మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో రుక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరోయిన్గా కనిపించనుంది. విద్యుత్ జామ్వాల్(Vidhyuth Jamval) ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఈ మూవీలో విక్రాంత్(Vikranth), షబీర్(Shabeer), బిజూ మీనన్(Biju Menon) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే సికందర్ సినిమా ఫలితం చూశాక మదరాసి ఎలా ఉంటుందోనని హీరో శివ కార్తికేయన్ అభిమానులు మురుగదాస్‌పై అనుమానపడుతున్నారు. ఇక, త్వరలో మదరాసి మూవీకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే చాన్సుంది.













