Kalyan Shankar: రవితేజ సినిమాను పక్కన పెట్టిన మ్యాడ్ డైరెక్టర్?

మ్యాడ్(mad), మ్యాడ్ స్వ్కేర్(mad2) సినిమాలతో మంచి హిట్లు అందుకున్న డైరెక్టర్ కల్యాణ్ శంకర్(kalyan sankar). ఆ రెండు సినిమాలతో డైరెక్టర్ గా కల్యాణ్ మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా వాటితో సితార ఎంటర్టైన్మెంట్స్(sithara entertainments) బ్యానర్ కు మంచి లాభాలను కూడా అందించాడు. అందుకే కల్యాణ్ నెక్ట్స్ మూవీని కూడా తమ బ్యానర్ లో చేయాలని నిర్మాత నాగవంశీ(naga vamsi) లాక్ చేసుకున్నాడు.
అందులో భాగంగానే మాస్ మహారాజా రవితేజ(raviteja)తో కల్యాణ్ శంకర్ ఓ సోషియో ఫాంటసీ మూవీని చేయనున్నాడని, సితార బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఆ సినిమా రూపొందనుందని వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇప్పటివరకు దాని గురించి ఎలాంటి అప్డేట్ లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో కొత్త వార్త వినిపిస్తోంది. కల్యాణ్ శంకర్ ప్రస్తుతం రవితేజ సినిమాను పక్కన పెట్టి ఓ హార్రర్ కామెడీని చేయాలని చూస్తున్నాడని టాక్.
బాయ్స్ హాస్టల్ లోకి దెయ్యం వస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో కల్యాణ్ శంకర్ ఓ సినిమాను తెరకెక్కించనున్నాడని, హార్రర్, కామెడీ రెండింటినీ మిక్స్ చేసి సినిమాను తీసి దాంతో ఆడియన్స్ ను అలరించాలని చూస్తున్నాడని, ఈ సినిమాను కూడా సితార బ్యానర్ లో నాగవంశీనే నిర్మించనున్నారని అంటున్నారు. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుని ఆ తర్వాత రవితేజ సినిమా గురించి ఆలోచిద్దామని కల్యాణ్ అనుకుంటున్నాడట.