సితార నుంచి మరో బ్లాక్ బస్టర్
స్టార్ హీరోలతో తీసే సినిమాల కన్నా మీడియం బడ్జెట్ లో తీసే మూవీస్ తోనే సితార సంస్థకు లాభాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇమేజ్, మార్కెట్ వల్ల మొదటి కేటగిరీలో సేఫ్ అవొచ్చు కానీ రిస్క్ తక్కువగా ఉన్న సినిమాలు వర్కవుట్ అయితే మాత్రం లాభాలు ఊహించని స్థాయిలో ఉంటాయి. డీజే టిల్లు, టిల్లు స్వ్కేర్ ఒకదాన్ని మించి మరొకటి ఏ రేంజ్ లో ఆడియన్స్ ను అలరిస్తున్నాయో కలెక్షన్లు చెప్తున్నాయి.
గతేడాది అక్టోబర్ లో కూడా ఇలాగే మ్యాడ్ సినిమా రూపంలో సితార సంస్థ భారీ లాభాలను అందుకుంది. ఇప్పుడు దాని సీక్వెల్ మ్యాడ్ మ్యాక్స్ రాబోతుంది. స్క్రిప్ట్ ఇప్పటికే ఫైనల్ అయిందట. మ్యాడ్ లో ఇంజనీరింగ్ చదివిన ముగ్గురు కుర్రాళ్లు చదువు పూర్తి చేసుకుని మూడేళ్ల తర్వాత బయట ప్రపంచంలో ఎదుర్కోబోయే సమస్యల్ని, ఉద్యోగ పర్వాన్ని చాలా ఎంటర్టైనింగ్ గా రాసుకున్నారట.
ఇది మరో బంగారు బాతవుతుందని ఇన్ సైడ్ టాక్. టిల్లూ స్వ్కేర్ ఒక దశ దాటాక సెకండాఫ్ విషయంలో సిద్దు జొన్నలగడ్డ సిద్దు జొన్నలగడ్డ, మల్లిక్ రామ్ కు మల్లగుల్లాలు పడుతుంటే కళ్యాణ్ శంకర్ ఎంట్రీ ఇచ్చాకే సరైన ఎపిసోడ్స్, మరిన్ని డైలాగ్స్ పడ్డాయని తెలిసింది. అలాంటిది తన డైరెక్షన్ లో సినిమా కోసం ఇంకెంత హిలేరియస్ గా రాసుకుంటాడో వేరే చెప్పనక్కర్లేదు. మ్యాడ్ క్యాస్టింగ్ ను మార్చకుండా మొత్తం వాళ్లతోనే మ్యాడ్ మ్యాక్స్ ను రూపొందిస్తారట. వచ్చే నెల నుంచి మ్యాడ్ మ్యాక్స్ రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.













