డల్లాస్ లో మా వేడుక
మా (మూవీ ఆర్టిస్టు అసోసియేషన్) సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా ఏప్రిల్ 28న అమెరికాలోని డల్లాస్లో తొలి కార్యక్రమం నిర్వహించనున్నారు. చిరంజీవి అతిథిగా పాల్గొంటారు. ఈ విషయాన్ని మా అధ్యక్ష కార్యదర్శలు శివాజీరాజ, నరేష్ తెలియజేశారు. సిల్వర్ జూబ్లీ సందర్భంగా 35 మందికి ఇస్తున్న పెన్షన్ మూడు వేలకు పెంచుతున్నట్టు వారు ప్రకటించారు. హీరోయిన్లు అందరూ మా సభ్యత్వం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈవెంట్ ఆర్గనైజర్లు రాధకృష్ణరాజు, స్టీఫెన్ పల్లామ్, రాంబాబు కల్లూరితో పాటుగా నటులు శ్రీకాంత్, సురేష్, బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.













