రికార్డులు సృష్టిస్తున్న పొలిమేర2
కరోనా టైమ్ లో నేరుగా హాట్ స్టార్ లోకి వచ్చిన సినిమా మా ఊరి పొలిమేర. చేతబడుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ట్విస్టులు, గూస్బంప్స్ సీన్స్ ప్రేక్షకులకు మంచి ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చాయి. ఎలాంటి పబ్లిసిటీ లేకపోయినా పొలిమేర సినిమాకు మంచి ఆదరణ దక్కడంతో పాటూ హాట్ స్టార్ లో హయ్యెస్ట్ వ్యూస్ తెచ్చుకున్న సినిమాల్లోఒకటిగా నిలిచింది.
పొలిమేర ఇచ్చిన బూస్ట్తోనే పొలిమేరకు సీక్వెల్ గా పొలిమేర2ని ఇంకొంచెం గ్రాండ్ గా తీసి, ఈసారి థియేటర్ లో రిలీజ్ చేశారు. బన్నీ వాసు ఈ సినిమాలో భాగం కావడంతో మంచి రిలీజ్ దక్కింది. రిలీజ్ కు ముందు అందరి దృష్టి తరుణ్ భాస్కర్ చేసిన కీడా కోలా సినిమా మీద ఉన్నప్పటికీ, రిలీజ్ తర్వాత పొలిమేర2 సంచలనాలు సృష్టిస్తోంది.
రిలీజ్ రోజు ఓ మోస్తరు కలెక్షన్స్ తెచ్చుకున్న పొలిమేర2, రోజురోజుకీ కలెక్షన్స్ ను పెంచుకుంటూ వీకెండ్ తర్వాత కూడా నిలకడగా ఉంది. ఫలితంగా స్క్రీన్స్, షో లు కూడా పెరిగిపోయాయి. టాక్ గొప్పగా లేకపోయినా, ఇందులోని ట్విస్టులు, థ్రిల్స్ ఆడియన్స్ ను మెప్పించడంతో ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే పొలిమేర2 అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఫుల్ రన్లో పది కోట్ల షేర్ ను ఈజీగా దాటేసేలా కనిపిస్తుంది. పొలిమేర2 సక్సెస్ తర్వాత రానున్న పొలిమేర3కు మంచి బూస్ట్ ఇవ్వనుంది.













