ముక్కోణపు పోటీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎలక్షన్స్

సినిమా పరిశ్రమలో గొడవలు పడటం ఇంకా అలాగే కలిసిపోవడం అనేవి సర్వ సాధారణం. ఇది ఎప్పట్నుంచో ప్రతి సినిమా ఇండస్ట్రీలో నడుస్తుంది. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలోమూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆ ఎలక్షన్స్ లో ఇప్పుడు సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్, జీవిత రాజశేఖర్ పోటా పోటీగా నువ్వా నేనా అంటూ తెగ పోటీ పడుతున్నారు. ఇక ఇండస్ట్రీలో వీరికి మిగిలిన నటీ నటులు సపోర్ట్ ఇస్తున్నారు. అయితే ఈసారి మెగా బ్రదర్ నాగ బాబు ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ ఇవ్వడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ వార్త మెగా అభిమానులకి షాకింగ్ గా వుంది. ఎందుకంటే గతంలో ప్రకాష్ రాజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు నాగ బాబు ప్రకాష్ రాజ్ పై ఫైర్ అయిన సంగతి తెలిసిందే.
కాని ఇప్పుడు తన తమ్ముడికి వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన ప్రకాష్ రాజ్ కి నాగ బాబు సపోర్ట్ ఇవ్వడం అనేది హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై మెగా ఫ్యాన్స్ కూడా కొంచెం అసంతృప్తిగా వున్నారు. కాని ఇందుకు బలమైన కారణం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఎన్ని గొడవలు జరిగిన ఎన్ని కోపాలు వున్నా కాని అవన్ని మరచిపోయి ఇండస్ట్రీ అంతా ఆరోగ్యకరమైన స్నేహ మయంగా ఉండాలనే ఆలోచనతో నాగ బాబు ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేస్తున్నారట. ఇక ప్రకాష్ రాజ్ కూడా పవర్ స్టార్ తో గతంలో నటించిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా కూడా వకీల్ సాబ్ సినిమాలో పవర్ స్టార్ సరసన నటించాడు. అలాగే తన అన్న మెగాస్టార్ చిరంజీవితో కూడా ప్రకాష్ రాజ్ కి మంచి సాన్నిహిత్యం వుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ఇలాంటి భేదాలు లేకుండా తన ఫ్రెండ్ మోహన్ బాబు కొడుకు మంచు విష్ణుకి సపోర్ట్ చేస్తున్నాడు. ఇదంతా కూడా ఇండస్ట్రీ స్నేహ భావంతో వుండాలని భావించి మెగా బ్రదర్స్ ఇలా ఆలోచించి చేస్తున్నారనేది ప్రధాన ఉద్దేశ్యం. జనాలు ఏమనుకున్నా కాని మెగా బ్రదర్స్ తీసుకున్న ఈ నిర్ణయం ఒక రకంగా చాలా మంచిదైనట్లు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.