మా లో ఈసారి ఎన్నికలు ఉండవు…
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) లో ఎన్నికలు ప్రకటించక ముందే పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు, మా మాజీ అధ్యక్షుడు మురళీ మోహన్ స్పందించారు. గాడితప్పిన మా ను మళ్లీ పట్టాలెక్కించడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. అందులో భాగంగానే ఈసారి ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా అధ్యక్షుడిని ఎంపిక చేసి మంచి కమిటీని ఏర్పాటు చేయాలని చూస్తున్నాం అన్నారు. దీనికోసం మా లో కొన్ని విధానాలు మార్చాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే నాతో పాటు చిరంజీవి, మోహన్‌బాబు, జయసుధ, కృష్ణంరాజు, ఇంకా మిగిలిన వాళ్లమంతా సమావేశం అవుతున్నాం అని మురళీ మోహన్ తెలిపారు.













