ఈ నెల 10న మా ఎన్నికలు
ఈ నెల 10న జరగనున్న మా ఎన్నికల్లో తమ ప్యానెల్‌ను గెలిపించాల్సిందిగా శివాజీరాజా విజ్ఞప్తి చేశారు. గతేడాది ఏకగ్రీవంగా మా అధ్యక్ష పదవిని చేపట్టిన శివాజీరాజా ఆ పదవిలో రెండోసారి కొనసాగేందుకు నరేష్ ప్యానల్‌తో తలపడుతున్నారు. తన ప్యానల్ మెంబర్స్ అందరితో మీడియా సమావేశం నిర్వహించారు. తన ప్యానెల్ గెలిపిస్తే.. మా సభ్యుల్లో సినిమా అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నవారికి ఇప్పుడిస్తున్న పెన్షన్ మరింత పెంచుతామని, వారికి ఆరు నెలలపాటు సరిపోయే బియ్యం, నూనె, పప్పు దినుసులు అందిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రత్యర్థి నరేష్‌పై నిప్పులు చెరిగారు.













