‘మా’ ఎన్నికల్లో నరేశ్ ప్యానల్ విజయం
తెలుగు చిత్ర పరిశ్రమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్ష ఎన్నికలు హోరాహోరిగా జరిగిన ఎన్నికల్లో నరేశ్ విజయం సాధించారు. ఉత్కంఠ బరితంగా ఎన్నికలు జరిగాయి. నరేశ్ కు 268 ఓట్లు పోలవ్వగా.. శివాజీ రాజాకు 199 ఓట్లు వచ్చాయి. దీంతో 69 ఓట్ల మెజార్టీతో నరేశ్ గెలిచినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. జనరల్ సెక్రటరీగా జీవిత రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా రాజశేఖర్, ఉపాధ్యక్షులుగా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ, కోశాధికారిగా రాజీవ్ కనకాల, జాయింట్ సెక్రటరీగా గౌతమ్‌రాజు, శివబాలాజీ గెలుపొందారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎన్నికల ఫలితాలను వెల్లడించారు.
ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా అలీ, రవిప్రకాశ్, తనికెళ్ల భరణి, సాయికుమార్, ఉత్తేజ్, పృథ్వి, జాకీ, సురేశ్ కొండేటి, అనితా చౌదరి, అశోక్ కుమార్, సమీర్, ఏడిద శ్రీరామ్, రాజా రవీంద్ర, తనీష్, జయలక్ష్మి, కరాటి కల్యాణి, వేణుమాధవ్, పసునూరి శ్రీనివాస్ ఎన్నికయ్యారు.













