Oscars 2025 లో మెరిసిన “M4M” Movie Heroine Jo Sharma

“M4M” (Motive for Murder) మూవీ హీరోయిన్ జో శర్మకు అరుదైన opportunity దక్కింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల వేడుకకు జో శర్మ వెళ్లారు . ఈ కలర్‌ఫుల్ ఈవెంట్ ని దగ్గరగా చూడటం ఎంతో సంతోషం గా భావించానని, ప్రఖ్యాత హాలీవుడ్ పాప్ సింగర్, నటి అరియానా గ్రాండే ను దగ్గరగా చూడటం ఓ అద్భుతమైన అనుభూతిగా మిగిలిందని జో శర్మ అన్నారు.
హీరోయిన్ పాత్రలో నటించిన “యమ్. ఫోర్. యమ్”(మోటివ్ ఫర్ మర్డర్) మూవీ విడుదలకు సిద్ధమవుతోందని ఈ సందర్బంగా జో శర్మ తెలిపారు. మోహన్ వడ్లపట్ల స్వీయదర్శకత్వంలో నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ “యమ్. ఫోర్. యమ్”(మోటివ్ ఫర్ మర్డర్) హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో జో శర్మ ప్రధాన పాత్రలో నటించింది.