ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ చేతికి అరుణ్ విజయ్ భారీ చిత్రం ‘మిషన్: చాప్టర్ 1’
‘మిషన్: చాప్టర్ 1’ నాలుగు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేస్తున్న నిర్మాత సుభాస్కరన్
భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందిస్తూ వరుస సక్సెస్‌లను సొంతం చేసుకుంటున్నారు ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్. సినిమాలను నిర్మించటంతో పాటు డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ తనదైన పంథాలో ఈ సంస్థ రాణిస్తోంది. ఎవరూ టచ్ చేయని అంశాలతో వైవిధ్యమైన కథాంశాలున్న సినిమాలను ప్రేక్షకులకు అందిస్తోంది లైకా ప్రొడక్షన్స్. కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ ‘మిషన్: చాప్టర్ 1’ తాజాగా లైకా ప్రొడక్షన్స్ నుంచి రాబోతున్నక్రేజీ చిత్రాల సినిమాల లిస్టులో చేరింది. ఈ చిత్రానికి ఎం.రాజశేఖర్, ఎస్.స్వాతి నిర్మాతలు.
సినీ ఇండస్ట్రీలో దిగ్గజ చిత్రాలుగా అందరి ఆదరాభిమానాలను పొందిన 2.0, పొన్నియిన్ సెల్వన్, ఇండియన్ 2 వంటి చిత్రాలు సహా ఎన్నో భారీ చిత్రాలను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ‘మిషన్: చాప్టర్ 1’ సినిమాను విశ్లేషించి ఒక పరిమితమైన హద్దులని లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావించింది లైకా టీమ్. ఈ క్రమంలో భాషా పరమైన హద్దులను ఈ సినిమా దాటుతుందని లైకా ప్రతినిధులు భావించారు. దీంతో లైకా సంస్థ ‘మిషన్: చాప్టర్ 1’ చిత్రాన్ని నాలుగు భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయటానికి సిద్ధమైంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, ఆడియో, థియేట్రికల్ రిలీజ్‌కి సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు నిర్మాతలు.
విలక్షణమైన సినిమాలను తెరకెక్కించే ప్రతిభ ఉన్న దర్శకుడు విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆయన చిత్ర నిర్మాణంలోని పలు విభాగాలతో పాటు ప్రజల అభిరుచులను ఆధారంగా చేసుకుని సినిమాలను రూపొందిస్తుంటారు. ‘మిషన్: చాప్టర్ 1’ చిత్రాన్ని కేవలం 70 రోజుల్లో లండన్, చెన్నై సహా పలు లొకేషన్స్‌లో శరవేగంగా చిత్రీకరించటం గొప్ప విషయం.
అద్భుతమైన టెక్నికల్ అంశాలతో రూపొందిన ‘మిషన్: చాప్టర్ 1’ చిత్రం హీరో అరుణ్ విజయ్ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళుతుందనటంలో సందేహం లేదు. చాలా గ్యాప్ తర్వాత.. 2.0లో నటించి అలరించిన ముద్దుగుమ్మ ఎమీ జాక్సన్ ఈ చిత్రంతో సినిమాల్లో అడుగు పెడుతున్నారు. జైలును సంరక్షించే ఆఫీసర్ పాత్రలో ఆమె కనిపించనున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన విలక్షణ నటి నిమిషా సజయన్ ఈ మూవీలో ఓ కీలక పాత్రను పోషించారు. జి.వి.ప్రకాష్ ఈ చిత్రానికి సంగీత సారథ్యాన్ని వహిస్తున్నారు.
ఈ సినిమా కోసం లండన్ జైలును పోలి ఉండేలా చెన్నైలో భారీగా ఖర్చుతో ఓ జైలు సెట్ వేశారు. స్టంట్ సిల్వ ఈ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రఫీ అందించారు. ఆయన యాక్షన్ సన్నివేశాలు సినిమాను చూసే ప్రేక్షకులకు ఆహా అనిపిస్తాయి. ఈ సినిమాలో చిత్రీకరించిన నైట్ షాట్స్, డ్రామా ప్రేక్షకులను ఉత్కంఠతకు లోను చేస్తుంది.
యాక్షన్ సన్నివేశాల్లో ఎంత కష్టమున్నప్పటికీ హీరో అరుణ్ విజయ్ వెనకడుగు వేయలేదు. ఆయనే స్వయంగా ఆ సన్నివేశాల్లో నటించారు. దీంతో యాక్షన్ సన్నివేశాలు రియలిస్టిక్‌గా వచ్చాయి. ఈ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.













