లక్స్ గోల్డెన్ రోజ్ పురస్కారాల వేడుక లో మెరిసిన తారలు
గులాబీలు సింగారించుకొంటే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా. బహుశా ఇలాగే ఉంటుందేమో. వెండితెరపై మెరిసిపోయే అందాల తారలు ఒక్కచోట చేరారు. కళ్లు జిగేల్మనేలా ముస్తాబై మురిపించారు. వాళ్లు ధరించిన దుస్తులు, అభరణాలు ఫ్యాషన్ ప్రియుల మనుసు దోచాయి. ముంబయిలో జరిగిన లక్స్ గోల్డెన్ రోజ్ పురస్కారాల వేడుకకు పలువురు బాలీవుడ్ తారలు హాజరై సందడి చేశారు. సరదాగా ఊసులెన్నో చెప్పుకున్నారు. జాన్వీకపూర్, ఆలియాభట్ స్టెప్పులతో అలరించారు. ఎరుపు, లేత గులాబీ రంగు గులాబీలతో అలంకరించిన బ్యాక్ గ్రౌండ్‌కు తగ్గట్టు కరీనా వేసుకొన్న డ్రెస్ మెరిసిపోయింది. ఎర్ర రంగు దుస్తుల్లో ఐశ్వర్య, శ్వేత కపోతాల్లా రకుల్ ప్రీత్ సింగ్, ఆలియాభట్, జాన్వీ కపూర్ ఆకట్టుకున్నారు. ఈ వేడుకల్లో జాక్వెలైన్ ఫెర్నాండెజ్, తాప్సి, మాధురీ దీక్షిత్, చిత్రాంగద సింగ్ తదితరులు పాల్గొన్నారు. అలనాటి కథా నాయిక జీనత్ అమన్‌ను మరో తార లేఖ ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్న దృశ్యం ఆకట్టుకుంది.













