విశ్వక్ కు పోటీ తప్పడం లేదుగా!
టాలీవుడ్ లో తనదైన ముద్ర వేయాలని చూస్తున్న దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి హీరోగా తెరకెక్కుతున్న సినిమా లక్కీ భాస్కర్. ఇప్పటికే రెండుసార్లు పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది. లక్కీ భాస్కర్ అక్టోబర్ 31న రిలీజ్ కానున్నట్లు సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
అయితే ఆల్రెడీ అక్టోబర్ 31న విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ రానున్నట్లు గతంలో మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఓ సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు. మెకానిక్ రాకీ తన కెరీర్ లోనే బెస్ట్ ఆల్బమ్ అవుతుందని, కథ కూడా చాలా కొత్తగా ఉంటుందని విశ్వక్ సినిమా గురించి బాగా ఊరించి అంచనాలను పెంచేశాడు.
మంచి రిలీజ్ డేట్ అవడంతో ఓపెనింగ్స్ కూడా బాగా వస్తాయనుకున్నారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు పోటీలోకి లక్కీ భాస్కర్ వచ్చి చేరింది. రిలీజ్ డేట్ కు ఇంకా టైముండటంతో ఇంకేమైనా సినిమాలు కూడా ఆ డేట్ కు వస్తాయేమో చెప్పలేం. కాంపిటీషన్ లేకుండా సోలోగా వద్దామనుకున్న విశ్వక్సేన్ ప్రతి సినిమాకూ పోటీ మాత్రం తప్పడం లేదు. మొన్న వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. ముందైతే మెకానిక్ రాకీకి పోటీ లేదనే అనుకున్నారు కానీ ఇప్పుడు లక్కీ భాస్కర్‌తో పోటీ పడాల్సి వస్తుంది.













