ఇంద్రగంటి నుంచి మరో చిన్న సినిమా
టాలీవుడ్ లో మంచి అభిరుచి ఉన్న సినిమాలు తీసే డైరెక్టర్ గా ఇంద్రగంటి మోహనకృష్ణకు ఓ స్పెషల్ ఇమేజ్ ఉంది. గ్రహణం, అష్టాచెమ్మా, అమీతుమీ, జెంటిల్మెన్, సమ్మోహనం లాంటి సినిమాలతో ఆయన తన స్పెషలాటీని ప్రూవ్ చేసుకున్నారు. చాలా వరకు ఆయన నుంచి వచ్చిన సినిమాలు లో, మీడియం బడ్జెట్ సినిమాలే.
అయితే ఇంద్రగంటికి ఎప్పట్నుంచో స్టార్ హీరోలతో సినిమా చేయాలని ఉంది. కానీ ఆ కోరిక ఇప్పటివరకు తీరలేదు. ఆయన్నుంచి చివరగా వచ్చిన సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి నిరాశపరచగా దాని రిజల్ట్ తో సంబంధం లేకుండా ఓ భారీ చిత్రం చేయడానికి ఇంద్రగంటి రంగం రెడీ చేసుకుంటున్నట్లు వార్తలొచ్చాయి.
దిల్ రాజు బ్యానర్ లో జటాయు పేరుతో ఇంద్రగంటి ఓ భారీ సినిమా చేస్తున్నట్లు చర్చ జరిగింది. దిల్ రాజు కూడా ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మరి ఆ బిగ్ బడ్జెట్ మూవీ ఎప్పుడు మొదలవుతుందా అనుకుంటుండగా ఇంద్రగంటి తన నెక్ట్స్ సినిమాను అనౌన్స్ చేశాడు. ప్రియదర్శితో ఇంద్రగంటి తన తర్వాతి సినిమాను ప్రకటించాడు. శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించనున్నాడు. ఈ సినిమాలో మార్చిలో సెట్స్ పైకి వెళ్లనుంది.













