లవ్ టుడే ని వదలని దిల్ రాజు…
కోలీవుడ్ లో యూత్ ఎంటర్టైనర్ గా సూపర్ హిట్టైన చిత్రం “లవ్ టుడే “. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు లో డబ్ చేసిన విషయం తెలిసిందే. “లవ్ టుడే” తెలుగు ప్రేక్షకులకి సైతం నచ్చుతుందనే ఉద్దేశం తో షేరింగ్ ఒప్పందం తో తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసారు.
ఈ సినిమాకి తెలుగు లో కూడా హిట్ టాక్ వచ్చింది. ట్రైలర్, టీజర్ ఇంట్రెస్టింగా ఉండడంతో ముఖ్యంగా యువత మూవీ చూడడానికి ఆసక్తి చూపించారు. దీంతో లవ్ టుడే మూవీ కి తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది.
దిల్ రాజు చేతిలోకి వచ్చాక ఈ మూవీ రేంజ్ మారిపోయింది. తెలుగు లోనే కాకుండా హిందీలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే బాలీవుడ్ లో డబ్బింగ్ వెర్షన్ కాకుండా ఏకంగా మూవీ ని రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీనికి తమిళ నిర్మాతలు ఓకే అనడంతో ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ చిత్ర హిందీ రీమేక్ లో నటీనటులు ఎవరు? అనేది హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ లోని యంగ్ హీరోలతో ఈ సినిమాని తెరకెక్కించాలని చూస్తున్నారట. అలాగే ఒక స్టార్ హీరోయిన్ ని కూడా ఫైనలైజ్ చేసినట్టు సమాచారం. చిన్న సినిమాగా తమిళం లో రిలీజ్ అయి, తెలుగులో హిట్టు కొట్టి, బాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది ఈ సినిమా. సినిమా నచ్చితే భాష తో సంబంధం లేకుండా ప్రేక్షకులు హిట్ చేస్తారు అనడానికి “లవ్ టుడే” సినిమానే నిదర్శనం.













