లవ్ స్టోరీ రిలీజ్ వాయిదా.. మంచి ఛాన్స్ మిస్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మళ్లీ కోరలు విప్పింది. కోవిడ్ వ్యాక్సినేషన్ ఒకవైపు జరుగుతూనే ఉన్నప్పటికీ, రోజురోజుకీ పాజిటివ్ కేసుల కౌంట్ పెరుగుతూనే ఉంది. దీంతో ఫిల్మ్ ఇండస్ట్రీలో మళ్లీ కలవరం మొదలైంది. సుమారు 10 నెలల తర్వాత ఇప్పుడిప్పుడే సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్న టైమ్ కు ఇప్పుడు మళ్లీ సెకండ్ వేవ్ కారణంతో సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందోననే భయం నెలకొంది.
బాలీవుడ్ లో ఇప్పటికే సినిమాలన్నీ వాయిదా వేసేశారు. ఇప్పుడు ఇక్కడ టాలీవుడ్ లో వచ్చే సినిమాల పరిస్థితేంటని ఆలోచిస్తున్నారు. ఏప్రిల్ 16న రిలీజ్ అవాల్సిన లవ్ స్టోరీ ని కరోనా ప్రభావాన్ని మైండ్ లో ఉంచుకుని, సేఫ్టీ ఫస్ట్ అంటూ సినిమాను వాయిదా వేశారు. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమాను శేఖర్ కమ్ముల తెరకెక్కించాడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా రెడీ చేసుకుని ఫస్ట్ ప్రింట్ తో రెడీ గా ఉన్న ఈ సినిమాను తెలుగుతో పాటూ కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు మేకర్స్.
ఇప్పటికే కర్ణాటక లో 50 శాతం ఆక్యుపెన్సీకి థియేటర్లను తగ్గించారు. దీంతో జనాలు మళ్లీ ఇళ్లకి, ఓటీటీలకే పరిమితమవుతారనే భయం కూడా ఉంది. అందుకే సినిమాను ఇప్పటికి వాయిదా వేస్తేనే మంచిదని భావించి, లవ్ స్టోరీ మేకర్స్ సినిమాను వాయిదా వేశారు. శేఖర్ కమ్ముల సినిమా కాబట్టి ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వచ్చే ఛాన్సుంది. కానీ ఈ 50 శాతం ఆక్యుపెన్సీతో ఫ్యామిలీస్ థియేటర్లకు రావడం కష్టం. అందుకే సినిమాను వాయిదా వేశారని తెలుస్తుంది. ఏప్రిల్ 16న సోలో రిలీజ్ ను మిస్ చేసుకున్న లవ్ స్టోరీకి తర్వాత మళ్లీ సోలో రిలీజ్ డేట్ దొరకడమంటే కష్టమే. కొత్త రిలీజ్ డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.













