Love Jathara: అంకిత్ కొయ్య, మానస చౌదరి జంటగా “లవ్ జాతర”

అంకిత్ కొయ్య (Ankith Koyya), మానస చౌదరి (Manasa Choudhary) హీరో హీరోయిన్లుగా యూజీ క్రియేషన్స్ బ్యానర్ లో “సమ్మతమే” ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి రూపొందిస్తున్న చిత్రానికి “లవ్ జాతర” (Love Jathara) టైటిల్ ఖరారు చేశారు. ప్రొడ్యూసర్ కంకణాల ప్రవీణ నిర్మిస్తున్న ఈ చిత్ర టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు.
ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే టైటిల్ కు తగినట్లే కంప్లీట్ రోలర్ కోస్టర్ లవ్ ఎంటర్ టైనర్ గా “లవ్ జాతర” సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తుండగా..సుజాత సిద్ధార్థ్ డీవోపీగా వ్యవహరిస్తున్నారు. “లవ్ జాతర”కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే మేకర్స్ ఇవ్వబోతున్నారు.